Visit of Swachh survekshana in Tanuku Municipality

స్వచ్ఛ్ భరత్ సంకల్ప సాకారంలో ప్రధానమైన సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణపై సర్వే ప్రక్రియ ప్రారంభమైనది. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలతో ఫోటి పది స్వచ్ఛ్ పురస్కారాన్ని సాధించేందుకు తణుకు పురపాలక సంఘం సిద్దమైనది. స్వచ్ఛ దిశగా పట్టణాన్ని పరిశీలించి నీవేకకాను స్వచ్హమిషన్ కు ఇచ్చేందుకు కేంద్రీయ బృందం సోమవారం వచ్చింది. కార్వే సంస్థ జిల్లా సమన్వ కర్త వి. కాశీ విశ్వనాధ్ ఆధ్వైర్యం లో ముగ్గురు ప్రతినిధులు పురపాలక సంఘమునకు రాగ చైర్ పర్సన్ శ్రీ. పరిమి వెంకటేశ్వర రావు గారు మరియు కమీషనర్ శ్రీ. జి. సాంబశివరావుగారు బృందాన్ని కలిసి చేపట్టిన పనులను వివరించారు. సంపూర్ణ స్వచ్చ సంకల్ప బృందం ద్వారా పట్టణములో చేపట్టిన పనుల వివరాలు , గణాంకాల దస్త్రాలను విశ్వనాధ్ పరిశీలించారు. వార్డుల వారీగా కొన్ని ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భముగా విశ్వనాధ్ గారు మాట్లాడుతూ దస్త్రాలను సునిశిత పరిశీలనా అనంతరం పురపాలక సంఘం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ , స్వచ్ఛ్ అంశాలపై ప్రజలకు అందిస్తున్న సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం అన్నారు. అనంతరం నిర్దేశించిన ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ పై ప్రజలను ప్రశ్నలు అడిగి సేవల సమాధానములను రాబడతామన్నారు. బహిరంగ మల , మూత్ర, రహిత పట్టణ సంకల్పం, ఇంటింటి చెత్త సేకరణ , ఆచెత్తను రవాణా చేసే విధానం , ముఖ్య కూడళ్లలో చెత్త బుట్టల ఏర్పాటు , తడి, పొడి చెత్త నుంచి ఎరువును తీసే ప్రక్రియ , వాహనాల పరిస్థితి , ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను స్వచ్ఛ మిషన్ కు పంపిస్తామన్నారు. కమీషనర్ శ్రీ. జి. సాంబశివరావు గారు మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్ప సాకారానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. , పారిశుద్ధ్య నిర్వహణను సక్రమముగా అమలు చేస్తున్నామన్నారు.